Sai Dharam Tej Pet Tango Passed Away: మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆ మధ్య యాక్సిడెంట్ కి గురై తిరిగి కోలుకుని మళ్ళీ సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ మధ్యనే విరూపాక్ష సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అసలు విషయం ఏమిటంటే ఆయన ఎప్పటినుండో ఓ కుక్కని పెంచుకుంటున్నారు. ఆయన తన కుక్కకు టాంగో పేరు కూడా పెట్టాడు. ఆ కుక్క అంటే సాయి తేజ్ కు చాలా ఇష్టం అని తెలుస్తోంది. షూట్ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు చాలా సమయం ఆ కుక్కతోనే స్పెండ్ చేసే వాడని తెలుస్తోంది.
Also Read: Toby: మారి ‘టోబీ’ అంటూ వచ్చేస్తున్న గరుడ గమన వృషభ వాహన టీమ్.. ఆ రోజే రిలీజ్!
అంతే కాదు తన కుక్క టాంగోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. ఇక తాజాగా తాను అమితంగా ప్రేమించే కుక్క టాంగో చనిపోవడంతో విషాదంలో మునిగిపోయాడు సాయి ధరమ్ తేజ్. తన కుక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ… సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. టాంగో కుక్క చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి తీసుకున్న ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ లెటర్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు తేజ్.
Also Read: Adipurush: తెలుగు బుకింగ్స్ ఓపెనే అవ్వలేదు.. కానీ లక్ష టికెట్లు అమ్ముడయ్యాయ్?
ఈ లెటర్ లో.. తన బాధని వ్యక్తపరుస్తూ..సుదీర్ఘంగా రాసుకొచ్చాడు. తేజ్ షేర్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. టాంగో నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు ఆనందంగా ఉంటుంది, అదే నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది, నన్ను నువ్వు రక్షించావు, నవ్వించావు. నా కష్టాల్లోనూ, నా సంతోషంలోనూ నువ్వు నాతో ఉన్నావు అంటూ ఆయన రాసుకొచ్చాడు. నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నిన్ను పొందడం నా అదృష్టం, నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు ఇప్పటికి స్పెషల్ మూమెంట్ లా గుర్తుంది, లవ్ యు మై బండ ఫెలో టాంగో అంటూ ఎమోషనల్ అయ్యాడు తేజ్. ఇక తేజ్ అలా ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టడంతో నెటిజనులు ఆయనను ఓదారుస్తున్నారు.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 13, 2023