‘పుష్ప’ చిత్రం నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. అయితే అంతకంటే ముందుగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు. తాజాగా “సామీ సామీ” అనే మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశారనిపిస్తోంది సుకుమార్. ఈ మొత్తం సాంగ్ 28వ తారీకు ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన సాంగ్ ప్రోమో మాత్రం విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్ “దాక్కో దాక్కో మేక”, రెండవ సాంగ్ “శ్రీవల్లి” మంచి ఆదరణను దక్కించుకుని, ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మూడవ సాంగ్ అంతకంటే ఎక్కువ ఆదరణను పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. “సామీ సామీ” సాంగ్ ను మౌనిక యాదవ్ పాడగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారన్న విషయం తెలిసిందే.
Read Also : జాతీయ పురస్కారాలు అందుకున్న మామఅల్లుడు!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే పూర్తి కానుంది. ‘పుష్ప: ది రైజ్’ ఈ ఏడాది డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ విలన్ గా కన్పించబోతున్నారు.