‘పుష్ప’ చిత్రం నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. అయితే అంతకంటే ముందుగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు. తాజాగా “సామీ సామీ” అనే మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశారనిపిస్తోంది సుకుమార్. ఈ మొత్తం సాంగ్ 28వ తారీకు ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు విడుదల చేయనున్నారు.…