RTC MD Sajjanar fires on Fans who damaged RTC Buses at Bigg boss 7 Telugu Finale: బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే ముగిసిన సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇపుడు చర్చనీయాంశం అయింది. స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడికి తెగబడ్డ అభిమానులు తొలుత రన్నరప్ అమర్‌దీప్ కారు అద్ధాలను, అశ్వినిశ్రీ, గీతు రాయల్ కార్ల అద్దాలపైనా దాడి చేశారు. బిగ్ బాస్ విజేత ప్రకటన తర్వాత రోడ్డుపై ఈ బీభత్సం జరిగగా అటుగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టగా ఈ కూర్మంలో డ్రైవర్ గాయపడ్డారు. ఇక తాజాగా ఈ విషయం మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇదేం అభిమానం అంటూ ప్రశ్నించిన ఆయన బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారని, ఈ దాడిలో 6 బస్సుల అద్దాలు ద్వంసం అయ్యాయని అన్నారు.
Pallavi Prashanth : బరితెగించిన అభిమానులు.. కప్ కొట్టిన పల్లవి ప్రశాంత్ కి షాక్ ఇచ్చిన పోలీసులు
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారని అన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్న ఆయన అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని అన్నారు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజం పై దాడి చేసినట్టే, ఇలాంటి ఘటనలను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం ఉపేక్షించేది లేదని అన్నారు. టీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఇక ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ బస్ లపై దాడులు జరుగుతుంటే అడ్డుకోలేని బిగ్ బాస్ నిర్వాహకులను కూడా బాధ్యులను చేస్తామని, బిగ్ బాస్ నిర్వాహకులపై కేసులు పెడతామని అన్నారు.