సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముంబైలో ఫుల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు హీరోలు. ఇప్పటికే ముంబైలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ త్రయమే కనిపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా ఉన్న స్టార్ హీరోలు తాజాగా కపిల్ శర్మ షో లో సందడి చేశారు.
బాలీవుడ్ లో కపిల్ శర్మ షో ఎంతటి పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో కి చాలా తక్కువమంది టాలీవుడ్ స్టార్లు వెళ్లారు అనేది కూడా తెలిసిందే. ఇక ఈ అవకాశాన్నీ ‘ఆర్ఆర్ఆర్’ బృందం అందుకొంది . ఇక ఈ షోకి సంబంధించిన ఒక చిన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కపిల్ శర్మ షో స్టేజిపై చరణ్ , తారక్ .. నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వేశారు. యాంకర్ కపిల్ శర్మ కూడా వారితో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చరణ్ , తారక్ తో పాటు రాజమౌళి , అలియా భట్ కూడా ఈ షో లో పాల్గొన్నారు. ఈరోజు ఈ షో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ షో లో ఆర్ఆర్ఆర్ బృందం ఎలాంటి రచ్చ చేయనుందో చూడాలి.
#RRR team today at #TheKapilSharmaShow 💥💥#AliaBhatt #JrNTR #RamCharan #RRRMovie pic.twitter.com/2njltLZw6P
— ☆ (@Hereforalia) December 23, 2021