ఆర్ఆర్ఆర్ వేడుక మొదలైపోయింది. కర్ణాటకలోని చిక్ బళ్ల పూర్ లో గ్రాండ్ గాప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే.అతిరధమహారథులు హాజరవుతున్న ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ త్రయం హైలైట్ గా నిలిచారు. ఇక ఈ వేడుకను కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని తలుచుకొని మొదలుపెట్టడం విశేషం. కన్నడ పవర్ స్టార్ ని అభిమానులు ఎప్పటికి గుర్తుంచుకుంటారని, ఆయన ఎప్పుడు అభిమానుల మనసులో నిలిచి ఉంటారని యాంకర్ చెప్తూ వేడుకను మొదలుపెట్టారు.. ఇక ఆ కొద్దిసేపు అందరు అప్పూ.. అప్పూ అంటూ కేకలు వేయడంతో వేదిక దద్దరిల్లింది. ఇక అంతేకాకుండా పునీత్ సాంగ్స్ తో డాన్సర్స్ ఆకట్టుకున్నారు.. ఆ సాంగ్స్ ని ఆయనకు డేడికేట్ చేయడం ఆకట్టుకుంది. ఈ విధంగా కర్ణాటక ప్రజలకు అప్పును మరోసారి గుర్తుచేశారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే . మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.