ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా ‘ఆర్ఆర్ఆర్’ గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేసిన మేకర్స్ అభిమానులకు రోజుకో ట్రీట్ ఇస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ రికార్డుల సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి హీరోల సోలో పోస్టర్స్, ఇద్దరు హీరోలు కలిసి ఉన్న పోస్టర్స్ ఎన్ని రిలీజ్ చేసినా ఇంకా అభిమానులు ఏదో కావాలని అడుగుతూనే ఉన్నారు.
ఇక అభిమానుల ఆత్రుత గుర్తించిన మేకర్స్ తాజాగా మరోసారి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. చరణ్ , తారక్ సోలో పిక్స్ ని రిలీజ్ చేశారు. కేవలం ఫ్యాన్స్ కోసం తమ అల్లూరి సీతారామరాజు అలాగే కొమరం భీం ఎన్టీఆర్ ల సోలో స్టిల్స్ ని రిలీజ్ చేసి అభిమానులలో ఉత్సాహం రేకెత్తించారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఇంటెన్సివ్ పోలీస్ లుక్ లో కనిపించగా.. కొమరం భీమ్ గా తారక్ చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తమ అభిమానుల హీరోలను ఈ లుక్ లో చుసిన ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోతున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.