సంగీత దక్షకుడు ఆర్పి పట్నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీకోసం సినిమాతో సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆర్పి పట్నాయక్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు ను సంపాదించారు.కాగా అప్పట్లో ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన చాలా పాటలు బ్లాక్ బస్టర్ హిట్ లు అయ్యాయి.. అలా సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఐదారు ఏళ్ల పాటు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత జోరును కొద్దిగా తగ్గించేశారు. కాగా ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ తేజ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు.2006లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం సినిమా తర్వాత మళ్లీ చాలా రోజులకు వీరిద్దరి కాంబినేషన్లో అహింస అనే సినిమా వచ్చింది. అహింస సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు ఆర్పీ పట్నాయక్. అభిరామ్ దగ్గుపాటి,గీతిక తివారి కలిసిన నటించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుందని సమాచారం…
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. సినిమా ఉన్నా లేకపోయినా కూడా నేను రోజుకి 18 గంటలు పని చేస్తాను. కన్నడలో కొన్ని సినిమాలు కూడా చేస్తున్నాను. అలాగే దర్శకత్వంకు సంబధించిన కొన్ని కథలు కూడా రాస్తున్నాను. అయితే నాకు సంగీతం ఎక్కువ పేరు తీసుకొచ్చింది. కానీ ఒక సందర్భంలో నేను మానేశాను.బాలు గారు నేను ఎక్కడ కనిపించినా మళ్లీ సంగీతం ఎప్పుడు మొదలు పెడుతున్నావ్ అని అడిగేవారు. అడిగిన ప్రతిసారీ కూడా చేస్తాను గురువు గారు అని చెప్పేవాడిని. సమస్య ఏమిటంటే నాకు కథ నచ్చితేనే చేస్తాను. మధ్యలో చాలా కథలు వచ్చాయి. కానీ చేయాలనిపించలేదు. బాలు గారు వెళ్లిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయాననే గిల్ట్ మాత్రం ఎక్కువ అయ్యింది. బాలు గారు నాకు స్ఫూర్తి. ఆయన పాటపై ఉన్న అభిమానంతో పరిశ్రమలోకి వచ్చాను. ఆయనకి ఇచ్చిన మాట తీర్చలేకపోయాననే బాధ ఎక్కువైంది అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు ఆర్పి పట్నాయక్. ఒకసారి తేజను కలిసి మళ్లీ మ్యూజిక్ చేయాలి అది బాలు గారి కోరిక అని అయితే చెప్పాను. ఆ తర్వాత కొద్ది రోజులకు తేజ ఫోన్ చేసి మనం సినిమా చేస్తున్నాం. అదే అహింస అని చెప్పుకొచ్చారు.