Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Romanchakam Trailer: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ట్రైలర్లో లవ్, కామెడీ, ఎమోషన్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను మేళవించినట్లు కనిపిస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను పరిశీలిస్తే.. సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య ప్రేమ, రిలేషన్షిప్ చుట్టూ కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. తొలుత క్యూట్ లవ్‌స్టోరీగా కనిపించినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు, ఎమోషనల్ సన్నివేశాలు, సస్పెన్స్ అంశాలు చోటుచేసుకున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా ‘యూ రూయిన్డ్ మై లైఫ్.. ఐ విష్ ఐ హేట్ యూ’ అంటూ వచ్చే డైలాగ్ కథలోని భావోద్వేగ సంఘర్షణను సూచిస్తోంది.
మరోవైపు స్నేహితుల జోక్యం, కుటుంబ సంబంధాలు, ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. లవ్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కలిపి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్‌లోని విజువల్స్, మ్యూజిక్ కూడా యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతికతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ట్రైలర్లో ‘ఎవరికో ఏదో నిరూపించుకోవాలని నిన్ను నువ్వు మోసం చేసుకోకు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Also Read
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
- Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు "కొత్త సినిమా"!**
- Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. "దాగుడు మూతలు దండాకోర్" అంటూ సంక్రాంతికి?
తాజావార్తలు
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!