Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా అంటే కేవలం హైదరాబాద్‌లోని స్టూడియోలకే పరిమితం కాదని, పల్లెల్లోనూ అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించే వినూత్న ప్రయత్నమే “కొత్త సినిమా”. యువ దర్శకుడు అజర్ పూర్తి స్థాయిలో స్థానిక ప్రతిభను నమ్ముకుని, ఏకంగా వంద మంది కొత్త నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్.. ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ (హైదరాబాద్‌లోనే ఎందుకు.. మా ఊర్లో ఎందుకు కాదు?) అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఘనంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అగ్ర దర్శక, నిర్మాతలు దర్శకుడు అజర్ సాహసాన్ని, ఆయన ఆత్మవిశ్వాసాన్ని కొనియాడారు. తమ్మారెడ్డి భరద్వాజ “సినిమా టైటిల్ మాత్రమే కాదు, అజర్ చేసిన ప్రయత్నం కూడా కొత్తదే. ఖర్చుకు భయపడకుండా తన ఊరికే వెళ్లి, అక్కడి వారికే శిక్షణ ఇచ్చి సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఇదొక అద్భుతమైన ప్రయోగం. సినిమాకు మంచి పేరు రావాలి.” అని అన్నారు.
వీఎన్ ఆదిత్య & వీరశంకర్ మాట్లాడుతూ “అవకాశాలు రాలేదని నిందించేవారు అజర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. హీరోలను నమ్ముకోకుండా కథనే హీరోగా నమ్మి అడుగులేసిన అతని ఆత్మవిశ్వాసమే ఈ సినిమాను విజయతీరాలకు చేరుస్తుంది.” అని అన్నారు. ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న కష్టాలను పంచుకుంటూ చిత్ర బృందం ఎమోషనల్ అయ్యింది. డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ “కొత్తవాళ్లం కదా ఎవరూ నమ్మలేదు. కానీ మా ఊర్లోనే ఆడిషన్స్ నిర్వహించి టాలెంట్ ఉన్నవారిని ఎంచుకున్నాం. సినిమా నిర్మాణంలో ఎన్నో ఆటంకాలను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.” అని అన్నారు. ఒకవైపు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, దర్శకత్వం బాధ్యతలను అజరే స్వయంగా నిర్వర్తిస్తుండటం విశేషం. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే గ్రాండ్ గా థియేటర్లలో సందడి చేయనుంది. పక్కా లోకల్ టాలెంట్ తో వస్తున్న ఈ “కొత్త సినిమా” బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!
Also Read
- Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
- Dulquer Salmaan: మేమిద్దరం 'నెపో కిడ్స్'.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!