Roja Ramani: టాలీవుడ్ హీరో తరుణ్ గురించి.. అతడి తల్లి రోజా రమణి గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రోజా రమణి.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆమె వారసత్వం పుణికిపుచ్చుకుని బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టాడు తరుణ్. సక్సెస్ ఫుల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ .. నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఉదయ్ కిరణ్ తరువాత లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న తరుణ్ కెరీర్ కొన్నేళ్లు క్రితం వెనుక పడిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ ల్లో కనిపిస్తూ ఉంటాడు. ఇక తరుణ్ వయస్సు 40 .. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కుర్ర హీరోలు 30 లోకి రాకముందే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తరుణ్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే అప్పట్లో తరుణ్ పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. నువ్వు లేక నేను లేను సినిమా సమయంలో ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో ఉన్నాడని, ఆమెను ప్రేమ పేరుతో తరుణ్ మోసం చేసాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత నవ వసంతం సినిమా సమయంలో తరుణ్- ప్రియమణి ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ రూమర్స్ పై రోజా రమణి స్పందించింది.
NTR 30: సముద్రం నిండా అతని కథలు.. రక్తంతో రాసినవి..
” తరుణ్ కు ఈమధ్య సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఇక నుంచి అది ఉండదు.. ప్రస్తుతం తరుణ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలోనే దాని ప్రకటన ఉంటుంది. ఇక తరుణ్ కు దైవభక్తి ఎక్కువ.. రోజు గంటన్నర పూజ చేస్తాడు. నా కొడుకు కెరీర్ లో వచ్చిన రూమర్స్ వలన నేను చాలా బాధపడ్డాను.. అయితే న నాకొడుకు ఏ తప్పు చేయలేదు.. ఆ తరువాత నేను వాటిని పట్టించుకోవడం మానేసాను. తరుణ్ పెళ్లి చేసుకుంటాడు.. అది ఒక్కటి జరిగితే చూడాలని ఉంది. తన పెళ్లి విషయం తనఏ వదిలేశాను. అది కూడా జరగాల్సిన సమయం వస్తే జరుగుతుంది.. దాని గురించి కూడా ఆలోచించడం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.