Rohan: ఇండస్ట్రీలో చిన్నా, పెద్ద, ముసలి, ముతక అని తేడా లేదు. ఎప్పుడు ఎవరికి ఫేమ్ వస్తుంది, ఎవరు హిట్ అందుకుంటారు.. ? ఎవరు స్టార్ స్టేటస్ ను తీసుకుంటారు అనేది ఎవరం చెప్పలేం. ఇక ఒక బాల నటుడు ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ పారితోషికాన్ని అందుకుంటూ.. స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. #90s వెబ్ సిరీస్ తో రోహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆదిత్య అనే పాత్రలో అతడు నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఈ సిరీస్ కన్నా ముందు రోహన్ చాలా సినిమాల్లో, సీరియల్స్ లో కూడాకనిపించి మెప్పించాడు. ఇక #90s వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన రోహన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పుడు రోహన్ ను తన పేరుకన్నా.. సాంప్రదాయనీ.. సుప్పినీ, సుద్దపూస కుర్రాడు అనే పిలుస్తున్నారు. ఇక తాజాగా రోహన్.. తనకు వచ్చిన స్టార్ స్టేటస్ ను బాగా ఉపయోగించుకుంటున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు,బెంగుళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్స్.. మాములుగా లేదు అని తెలుస్తోంది.
రోహన్ రాయ్.. కుటుంబంతో కలిసి బెంగుళూరులో నివసిస్తున్నాడు. అవ్వడానికి తెలుగు కుటుంబమే అయినా కూడా బెంగుళూరులో స్థిరపడినట్లు తెలుస్తోంది. చిన్నతనం నుంచే రోహన్ కు నటనపై మక్కువ ఎక్కువ కావడంతో చిన్న చిన్న షోస్ లో పాల్గొన్నాడు. ఆ తరువాత వినయ విధేయ రామ చిత్రంలో చిన్నప్పటి రామ్ చరణ్ గా రోహన్ నటించి మెప్పించాడు. ఈ సినిమా హిట్ కాకపోయినా రోహన్ ఎక్స్ ప్రెషన్స్ ట్రోల్ మెటీరియల్ గా మారాడు. మద్యమద్యలో కొన్ని సినిమాల్లో నటించిన రోహన్.. కళ్యాణ్ వైభోగమే అనే సీరియల్ లో నటించి మెప్పించాడు. ఇక చాలా గ్యాప్ తరువాత రోహన్ #90s లో నటించాడు. ఈ సిరీస్ అతడి లైఫ్ మారిపోయింది. అప్పుడు రోహన్.. రోజుకు ఐదువేలు తీసుకునేవాడు.. ఇప్పుడు రోజుకు ముప్పై వేలు డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాదు.. అతడి కోసం బెంగుళూరు నుంచి ఫ్లయిట్ టికెట్లు వేసి మరీ హైదరాబాద్ తీసుకొస్తున్నారట. దీంతో రోహన్ లెవెల్ నెక్స్ట్ రేంజ్ లోకి మారింది. మరి భవిష్యత్ లో రోహన్ ఖచ్చితంగా హీరో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.