టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇక్కడ అవకాశాలు లేక ముంబైలో లక్ పరీక్షించుకుంటోంది రకుల్. అయితే ఆ ప్రయత్నంలోనూ అమ్మడు అంతగా విజయం సాధించలేకపోయింది. కానీ ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రకుల్ ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ‘పసూరి’ సాంగ్ కు రకుల్ చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆలీ సేతి, షే గిల్ పాడిన ఈ పాట ఇప్పటికే 20 కోట్ల వ్యూస్ తో ఆడియన్స్ ను అలరిస్తూ ఉంది. ఇప్పుడు రకుల్ తన గ్లామర్ ట్రీట్ తో పాట వ్యూస్ మరింతగా పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇక వర్క్ విషయానికి వస్తే ఇటీవల రకుల్ నటించిన ‘అటాక్, రన్‌వే 34’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ‘చత్రీవాలి, మిషన్ సిండ్రెల్లా, థాంక్స్ గాడ్’ మూవీస్ లో నటిస్తోంది. మరి ఈ సినిమాలలో ఏది రకుల్ కు హిట్ ని అందిస్తుందో చూద్దాం.