Rithu Chowdari : రీతూ చౌదరి.. ఈ నడుమ ఎంతగా వార్తల్లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఆమె పోలీసుల విచారణ కూడా ఎదుర్కొన్నది. తనకు తెలియక చేశానని క్షమించాలని కూడా కోరింది. అయితే కెరీర్ పరంగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్న టైమ్ లో ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఆమెను చుట్టు ముట్టింది. ఇక పోలీస్ విచారణ తర్వాత ఆమె దాని గురించి మాట్లాడటం లేదు. కేవలం తన ప్రొఫెషన్ మీదనే మళ్లీ దృష్టి పెట్టింది. ఇప్పుడు వరుసగా సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఇటు బుల్లితెరపై మెరుస్తోంది.
Read Also : Pushpa-2 : ‘పుష్ప పుష్ప’ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..
ఇక షూటింగులతో ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది ఈ భామ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి బ్లాక్ కలర్ చీరలో తన సొగసుల గాలం వేసింది. ఇందులో ఆమె హాట్ హాట్ గా మెరిసిపోయింది. ఇందులో తన నడుము అందాలతో పాటు టాప్ అందాలను కూడా పరిచేసింది. ఇంత ఘాటుగా చూపించేయడంతో ఆమె అందాలు కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రీతూకి ఇంత అందం ఉన్నా సరే అందుకు తగ్గట్టు అవకాశాలు రావట్లేదని.. గుర్తించాలంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లతో నింపేస్తున్నారు.