వివాదాస్పద దర్శకుడు ఏం చేసినా వెరైటీనే. తాజాగా అందరూ ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని సంతోషంగా జరుపుకున్నారు. అయితే ఈ పండగపై కూడా వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. అంతేకాదు తెలుగు వారు సొంత సంస్కృతికి ద్రోహం చేస్తున్నారా ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. “ఉగాదిలో సంతోషం ఏమిటో నాకు తెలియదు కాబట్టి నేను ఉగాది శుభాకాంక్షలు చెప్పను. తెలుగు ప్రజలు ఉగాది కంటే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు వారు తమ సంస్కృతికి ద్రోహం చేస్తున్నారా ??? జస్ట్ ఆస్కింగ్” అంటూ కామెంట్స్ చేశారు. అనడం అయితే అన్నాడు గానీ ఆ వెంటనే డేంజరస్ హీరోయిన్లతో కలిసి ఉగాదిని సెలెబ్రేట్ చేసుకున్నారు.
Read Also : Rahul Sipligunj : పబ్ లో అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ విన్నర్… పోలీసుల అదుపులో 150 మంది
“అంతా మా ఇష్టం – డేంజరస్” అనే సినిమాతో వర్మ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న వర్మ హీరోయిన్లు అప్సరా రాణి, నైనా గంగూలీ కలిసి ఉగాదిని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరు ముద్దుగుమ్మలకు వర్మ స్వయంగా ఉగాది పచ్చడిని తినిపించారు.