RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు అభిమానులు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే అర్జీవికి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న వర్మ.. ఇప్పుడు కొంతమంది బయోపిక్ లు తీసి వివాదాలను సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా రాజకీయ నేతల బయోపిక్స్ తీయడంలో వర్మ సిద్ధహస్తుడు. ఇక ఏపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ ను తీస్తున్నట్లు ప్రకటించాడు. వ్యూహం అనే పేరుతో ఈ బయోపిక్ ను తెరకెక్కించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో వర్మ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.
తాజాగా వర్మ.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. రాజకీయపరంగా పవన్ పై ఎప్పుడు విమర్శలు గుప్పించే వర్మ.. సినిమాల పరంగా పవన్ అంటే ఇష్టమని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు చాలా స్టార్ డమ్ ఉందని చెప్పుకొచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్.. పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే ఉద్దేశ్యం ఉందా.. ? అన్న ప్రశ్నకు వర్మ మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న స్టార్ డమ్ కు.. నా టైప్ ఆఫ్ సినిమాకు సెట్ ఎవ్వడు. నేనెప్పుడూ రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్స్, జోనర్ ఫిల్మ్స్ చేస్తాను. పవన్ కళ్యాణ్ చాలా పెద్ద స్టార్.. ఆయనకు ఉన్న ఇమేజ్.. తన ఫ్యాన్స్ కు తన నుంచి అంచనాలు ఉంటాయి. అలాంటి కెపాసిటీ లేదు నా దగ్గర డైరెక్టర్ గా. నేను చేయడం కాదు.. అసలు నేను చేయలేను. ఆయన ఇమేజ్ కు తగ్గ కథను క్రియేట్ చేసే కెపాసిటీ నాకు లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.