War 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీ గురించి చాలా రకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్లాప్ కు గల కారణాలపై ఇప్పటికే చాలా రచ్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంట్వ్యూలో పాల్గొన్న ఆయన.. వార్-2లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై మాట్లాడారు. ఆ సీన్ లో హీరో జపాన్ వాళ్లతో ఎందుకు ఫైట్ చేశాడో అస్సలు అర్థం కాలేదు నాకు. అదే విషయాన్ని సినిమాకు చెందిన ఓ కీలక వ్యక్తిని అడిగా. అంటే జపాన్ వాళ్లతో ఫైట్ చేయడం కొత్తగా ఉంటుందనే కాన్సెప్టుతో దాన్ని పెట్టారు అని చెప్పాడు.
Read Also : Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..
అది విని నాకు మైండ్ పనిచేయలేదు. ఎందుకంటే స్పై యూనివర్స్ సినిమాలు అంటే మన ఇండియాకు శత్రుదేశాలతో పోరాడే సినిమాలు ఉండాలి. కానీ మన ఇండియాకు జపాన్ ఎప్పుడు శత్రుదేశం అయింది. ఈ లాజిక్ వాళ్లకు తెలియదా. మన శత్రుదేశాలతో పోరాడటమే వార్-2 సినిమా ఉద్దేశం కదా. కానీ సినిమాలో అసలు సంబంధమే లేకపోయినా జపాన్ వాళ్లతో ఫైట్ పెట్టేశారు. అది ప్రేక్షకులకు కన్విన్స్ గా అనిపించలేదు. ఇలాంటి సీన్లు వార్-2లో చాలా ఉన్నాయి. అందుకే అది ఆడలేదు. హీరో ఇంట్రడక్షన్ సీన్ కొత్తగా ఉండాలనే ఆరాటంతో ఇలాంటివి అన్నీ చేస్తున్నారు. కానీ కథ చచ్చిపోతుందనే విషయాన్ని ఆలోచించట్లేదు అని అన్నాడు ఆర్జీవీ.
Read Also : Mahesh Vitta : తండ్రి అయిన పాపులర్ కమెడియన్..