Chiranjeevi: గద్దర్ అవార్డుల పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. చిరంజీవి కీలక ట్వీట్
- గద్దర్ అవార్డుల పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- చిరంజీవి కీలక ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించి కొంత కాలం అవుతోంది. అయినా ఈ అవార్డుల గురించి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ తాజాగా రేవంత్ రెడ్డి ఒక సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద గుర్రుగా ఉన్నారంటూ పలు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చాలా రోజుల నుంచి భావిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అంటూ పేర్కొన్నారు. నిజానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మళ్లీ అవార్డులు ప్రకటించలేదు. అయితే పలు సందర్భాలలో రేవంత్ రెడ్డిని కలిసిన సినీ పెద్దలు ఈ నంది అవార్డులు మళ్ళీ ఇస్తే బాగుంటుందని సూచించారు. ఒక కార్యక్రమంలో నంది అవార్డుల బదులు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!