మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించి కొంత కాలం అవుతోంది. అయినా ఈ అవార్డుల గురించి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ తాజాగా రేవంత్ రెడ్డి ఒక సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద గుర్రుగా ఉన్నారంటూ పలు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి.…