సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన “రిపబ్లిక్” అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. “రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్ చేసి ఓ పోస్టర్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు మేకర్స్.
Read Also : మరో వివాదంలో శంకర్… చరణ్ కు తప్పని తిప్పలు
సెప్టెంబర్ 6న ఈ చిత్రం నుంచి రెండవ సాంగ్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ విడుదలైన మొదటి సాంగ్ “గానా ఆఫ్ రిపబ్లిక్” అందరినీ ఆకట్టుకుంది. ఇక “రిపబ్లిక్”లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మరో మంచి శ్రీకారం చుట్టారు. #ThankYouCollector Stories అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సెప్టెంబర్ 8 నుండి జిల్లా కలెక్టర్లు చేసిన మంచి, సాహసవంతమైన పనులకు సంబంధించిన కథనాలను ప్రజలతో పంచుకుంటారు.