తొలిసారి దర్శకుడి వ్యాఖ్యానంతో ఓటీటీలో సినిమా
ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎవరు దానిని అందిస్తారో వారికి ప్రేక్షకాదరణ దక్కుతుంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘జీ 5’ అలాంటి ప్రయోగం చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతోంది. మన దేశంలో ఇలాంటి రిలీజ్ ఇదే ఫస్ట్. తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం.
వెబ్ సిరీస్, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్, ఒరిజినల్ మూవీస్ ఇలా వీక్షకులు కోరుకునే వాటిని అందిస్తూ వస్తోది జీ5. తెలుగు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తోంది. తెలుగులో గత ఏడాది పలు సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్ గా రిలీజ్ చేసింది. థియేటర్లలో హిట్ అయిన ‘రాజ రాజ చోర’ను విజయదశమికి, ‘శ్రీదేవి సోడా సెంటర్’ను దీపావళికి విడుదల చేసింది. ఇటీవల ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, దీనికి ముందు ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ రిలీజ్ చేసింది. ఈ 26న ‘రిపబ్లిక్’ సినిమాను విడుదల చేయనుంది.
Also Read
- Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
- Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
- Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
- Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ నిర్మించిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ తీసిన చిత్రమిది. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో!
సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే… తాను ఏ కోణంలో సదరు సన్నివేశం, సినిమా తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపించనుండటం మాత్రం కొత్త తరహా ప్రయోగమే. అటువంటి ప్రయత్నానికి ‘జీ 5’, దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు. మరి ఈ ప్రయోగం విజయవంతం అయితే రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను ఇలా డైరక్టర్స్, స్టార్స్ వాయిస్ తో చూడవచ్చు. ఆల్ ద బెస్ట్ చెబుదామా!
తాజావార్తలు
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!