Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు పవన్ ఫ్యాన్స్ కు మధ్య జరుగుతున్న గొడవ ఇంకా కొనసాగతూనే ఉంది. అకీరా పుట్టినరోజున.. పవన్ ఫ్యాన్.. మా అన్న కొడుకును చూపించు అన్న మాటకు రేణు ఫైర్ అయ్యింది. మీ అన్న కొడుకు..? అకీరా నా కొడుకు అంటూ చెప్పుకొచ్చింది. ఇలా మొదలైన ఈ గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. పవన్ ఫ్యాన్స్ రేణును దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకోపక్క రేణు సపోర్టర్స్.. పవన్ ను ఏకిపారేస్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ ను షేర్ చేస్తూ రేణు తన బాధను వెళ్లగక్కుతోంది. నిన్నటికి నిన్న పవన్.. తన ఫ్యాన్స్ ను ఆపొచ్చుగా అని కామెంట్ పెట్టిన పోస్ట్ ను షేర్ చేస్తూ .. నా కంట్రోల్లో లేని విషయాలను నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు అని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా మరోసారి రేణు.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలపై మండిపడింది.
Renu Desai: “ఆ పిచ్చి ఫ్యాన్స్ నోళ్లు మూయించు.. పవన్”
ఇక తాజాగా ఇలాంటి విమర్శలు పడకుండా పవన్ ఫ్యాన్స్ రేణుకు సలహాలు ఇచ్చారు. అసలు ఈ కామెంట్స్ ను చదివి రిప్లై ఇవ్వడం ఎందుకు.. సెట్టింగ్స్ కు వెళ్లి కామెంట్స్ సెక్షన్ ను ఆఫ్ చేసేయ్.. ఇలాంటివాటి నుంచి దూరంగాయూ ఉండు అంటూ సలహాలు ఇచ్చారు. ఇక ఈ సలహాల పోస్టులను కూడా రేణు షేర్ చేస్తూ ..” ఇదే సమాజంతో ప్రాబ్లెమ్.. ఎవరి కోసమో నేను మారాలా?.. మీరు చెప్పినట్లు జీవించడానికి నేను తప్పు చేయలేదు. అసలు సలహాలు ఇవ్వడానికి మీరెవ్వరు. మీకేం తెలుస్తుంది నా బాధ.. సలహాలు చెప్పఁడం ఈజీనే.. పడేవాడికి తెలుస్తుంది బాధ” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. నా సెట్టింగ్స్ లో కామెంట్స్ ఆఫ్ చేయమని చెప్పడానికి మీరెవ్వరు.. నన్ను ఫాలో అయ్యేవారి కోసం. మీరే నన్ను ఫాలో అయ్యి, కామెంట్స్ పెట్టి.. మళ్లీ మీరే నన్ను అన్ ఫాలో చేస్తూ.. చివరికి నన్ను విలన్ గా చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.