పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ నటనకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. జానీ సినిమా తరువాత రేణు వెండితెరపై కనిపించింది లేదు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై జడ్జ్ గా మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టనున్నదట. ఇందుకోసం భారీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరావు’ బయోపిక్ లో రేణు ఒక కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బయోపిక్ లో రవితేజ సోదరి పాత్రలో రేణు కనిపించనున్నదని సమాచారం. ఇప్పటికే ఆ పాత్ర గురించి రేణుతో చర్చలు కొనసాగుతున్నాయట.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా కావడంతో ఈ సినిమాపై రవితేజ భారీ అంచనాలనే పెట్టుకున్నాడు. ఇక అందుకు తగ్గట్టుగానే క్యాస్టింగ్ ని కూడా సెలెక్ట్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. దీనికోసమే రేణును ప్రత్యేకంగా సెలెక్ట్ చేసారని తెలుస్తోంది. మరి ఈ ఆఫర్ ని రేణు ఒప్పుకుంటుందా..? లేదా అంది తెలియాల్సి ఉంది. ఒకవేళ రేణు కనుక ఈ ఆఫర్ ని ఒప్పుకుంటే కనుక.. జానీ తరువాత రేణు నటించే చిత్రం ‘టైగర్ నాగేశ్వరావు’ అవుతుంది. మరి త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.