తెలుగు నవ్వుల అంగి… రేలంగి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 9న రేలంగి జయంతి)
అదేదో జానపద కథలో ఓ అంగీ తొడుక్కోగానే అంతా మంచే జరుగుతూ ఉంటుంది. అదే తీరున రేలంగిని చూడగానే నవ్వులు మన సొంతమవుతూ ఉంటాయి. అందుకే అన్నారు – నవ్వుల అంగి… రేలంగి అని. తెలుగు సినిమా హాస్యానికి రేలంగి మకుటంలేని మహారాజు. తెలుగు చిత్రసీమలో నవ్వుల పర్వాన్ని రేలంగికి ముందు, రేలంగికి తరువాత అని విభజించవలసి ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం మొదలు, తెలుగు చిత్రాల్లో విలువలు కరగిపోతున్నంత వరకూ రేలంగి నవ్వులు పంచారు. అందువల్ల రేలంగి ముందు, తరువాత అనడం సబబు. అంతకు ముందు కొందరు నవ్వుల పేరిట వెకిలి వేషాలు వేస్తూ సాగారు. కొందరయితే, ఆ రోజుల్లోనే ద్వంద్వార్థాలు తీస్తూ అదే హాస్యం అని చాటారు. అయితే రేలంగి అడుగుపెట్టిన తరువాత హాస్యం అంటే ఎంతటి కత్తిమీద సామో అందరికీ తెలిసి వచ్చేలాచేశారు. తాను నవ్వకుండానే ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేసేవారు రేలంగి. తెలుగునాట హాస్యానికి తొలి ‘పద్మం’ సంపాదించిన ఘనత కూడా ఆయనదే!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెంలో జన్మించిన రేలంగి వెంకట్రామయ్య బాల్యంలోనే శ్రావ్యంగా పాడుతూ ఉండేవారు. ఆయన గొంతు విన్న పెద్దలు సంగీత సాధన కూడా చేయమన్నారు. హరికథలు చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించారు. అలాగే హార్మోనియం వాయించడంలోనూ దిట్ట అనిపించారు. ఆ రోజుల్లో నాటకాల్లో నటించడానికి రూపంతో పాటు, గాత్రం, కాసింత సంగీతజ్ఞానం కూడా ఎంతో అవసరం. రేలంగికి అవి పుష్కలంగా ఉండడంతో ఇట్టే నాటకరంగంలో దిట్టగా నిలిచారు. 1935లో సి.పుల్లయ్య తెరకెక్కించిన ‘శ్రీకృష్ణతులాభారం’లో శ్రీకృష్ణుని చెలికాడు వసంతయ్యగా నటించి నవ్వులు పూయించారు. సి.పుల్లయ్య చిత్రాలలో నటిస్తూనే ఆయన సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్నారు రేలంగి. పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘గొల్లభామ’ ఆ రోజుల్లో మంచి విజయం సాధించింది. ఇందులో రేలంగి పాత్ర జనం మన్ననలు పొందింది. ఇక రేలంగి మరి వెనుతిరిగి చూసుకోకుండా నటనలోనే సాగిపోయారు. సొంతగా పాడుతూ, తనదైన అభినయంతో ఆకట్టుకుంటూ సాగారు రేలంగి. ‘పాతాళభైరవి’లో రాజుగారి బావమరిది ధీరశూరసేనునిగా రేలంగి అభినయంతో గిలిగింతలకు గురికానివారు ఉండరు. సి.పుల్లయ్యకు రేలంగి అంటే వాత్సల్యం. అందువల్ల తన చిత్రాలలో కీలక పాత్రలు అందిస్తూ ఉండేవారు. రేలంగి సైతం వాటిలో పరకాయ ప్రవేశం చేసి మురిపించేవారు. 1953లో రేలంగిని హీరోగా పెట్టి ‘పక్కయింటి అమ్మాయి’ అనే చిత్రాన్ని రూపొందించారు పుల్లయ్య. అంజలీదేవి నాయికగా నటించిన ఈ చిత్రం అప్పట్లో నవ్వులు పూయిస్తూ మంచి విజయం అందుకుంది. ఈ చిత్రానికి ‘పషేర్ బరి’ అనే బెంగాలీ సినిమా ఆధారం.
‘గుణసుందరి కథ’లోని కాలమతి, ‘మనదేశం’లోని పోలీస్ వెంకటస్వామి, ‘పాతాళభైరవి’లోని రాజుబామ్మర్ది, ‘రాజు-పేద’లోని సుధీర్, ‘మిస్సమ్మ’లోని దేవయ్య, ‘రోజులు మారాయి’లోని పోలయ్య, ‘మాయాబజార్’లోని లక్ష్మణ కుమారుడు, ‘అప్పుచేసి పప్పుకూడు’లోని భజగోవిందం, ‘జగదేకవీరుని కథ’లోని రెండుచింతలు, ‘లవకుశ’లోని తిప్పడు, ‘నర్తనశాల’లోని ఉత్తరకుమారుడు – వంటి పాత్రల్లో రేలంగి అభినయం చూసిన తరువాత మరొకరిని ఊహించుకోలేం. రేలంగి నిర్మాతగా మారి 1960లో ‘సమాజం’ అనే చిత్రం నిర్మించారు. అది ఆట్టే విజయం సాధించలేకపోయింది. తాడేపల్లి గూడెంలో రేలంగి థియేటర్ ను నిర్మించారు. 1970లో రేలంగికి పద్మశ్రీ పురస్కారం లభించింది. చివరి దాకా రేలంగి నవ్వుల పువ్వులు పూయిస్తూనే సాగారు. అందుకే ఈ నాటికీ రేలంగి చిత్రాలు అనగానే ముఖాల్లో నవ్వులు తాండవిస్తాయి. భావితరాలు సైతం రేలంగి హాస్యాభినయం చూసి మురిసిపోతున్నారు. ఏదేమైనా తెలుగు చిత్రసీమ నవ్వుల వనంలో రేలంగి ఓ వాడని పువ్వు.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!