(ఆగస్టు 9న రేలంగి జయంతి) అదేదో జానపద కథలో ఓ అంగీ తొడుక్కోగానే అంతా మంచే జరుగుతూ ఉంటుంది. అదే తీరున రేలంగిని చూడగానే నవ్వులు మన సొంతమవుతూ ఉంటాయి. అందుకే అన్నారు – నవ్వుల అంగి… రేలంగి అని. తెలుగు సినిమా హాస్యానికి రేలంగి మకుటంలేని మహారాజు. తెలుగు చిత్రసీమలో నవ్వుల పర్వాన్ని రేలంగికి ముందు, రేలంగికి తరువాత అని విభజించవలసి ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం మొదలు, తెలుగు చిత్రాల్లో విలువలు కరగిపోతున్నంత వరకూ…