తెలుగునాట టాప్ స్టార్స్ లో నటరత్న యన్.టి.రామారావులాగా పలు విలక్షణమైన పాత్రలు పోషించిన వారు కానరారు. రామారావుకు పాత్రలో వైవిధ్యం కనిపిస్తే చాలు, వెంటనే ఒప్పేసుకొనేవారని ప్రతీతి. అలా ఆయన అంగీకరించిన చిత్రాలలో విలక్షణ పాత్రలు బోలెడున్నాయి. ‘సంకల్పం’ చిత్రంలో యన్టీఆర్ పోషించిన రఘు పాత్ర అలాంటిదే! జల్సాల కోసం దొంగతనాలు చేసే రఘు, చివరకు పెళ్ళాం నగలు ఎత్తుకెళ్ళి మనసు పడ్డ దానికి ఇస్తాడు. ఇలాంటి విలక్షణ పాత్రలో నందమూరి నటన విశేషంగా అలరించింది. ‘సంకల్పం’…
(ఆగస్టు 9న రేలంగి జయంతి) అదేదో జానపద కథలో ఓ అంగీ తొడుక్కోగానే అంతా మంచే జరుగుతూ ఉంటుంది. అదే తీరున రేలంగిని చూడగానే నవ్వులు మన సొంతమవుతూ ఉంటాయి. అందుకే అన్నారు – నవ్వుల అంగి… రేలంగి అని. తెలుగు సినిమా హాస్యానికి రేలంగి మకుటంలేని మహారాజు. తెలుగు చిత్రసీమలో నవ్వుల పర్వాన్ని రేలంగికి ముందు, రేలంగికి తరువాత అని విభజించవలసి ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం మొదలు, తెలుగు చిత్రాల్లో విలువలు కరగిపోతున్నంత వరకూ…