(సెప్టెంబర్ 29న యన్టీఆర్ ‘అడుగుజాడలు’కు 55 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్, నటచక్రవర్తి యస్వీఆర్ డాక్టర్లుగా నటించిన చిత్రం ‘అడుగుజాడలు’. తాపీ చాణక్య దర్శకత్వంలో నవజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.సాంబశివరావు, జి.వందనం ‘అడుగుజాడలు’ నిర్మించారు. ఈ చిత్రంలో జమున నాయికగా నటించారు. 1966 సెప్టెంబర్ 29న ఈ సినిమా విడులయింది. ‘అడుగుజాడలు’ కథ విషయానికి వస్తే- డాక్టర్ కృష్ణ ఎంతో మేధావి. తన వైద్యంతోనూ, మంచితనంతోనూ దుర్మార్గులను సైతం సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. పోలియోకు అప్పట్లో తగిన వైద్యం…
(ఆగస్టు 9న రేలంగి జయంతి) అదేదో జానపద కథలో ఓ అంగీ తొడుక్కోగానే అంతా మంచే జరుగుతూ ఉంటుంది. అదే తీరున రేలంగిని చూడగానే నవ్వులు మన సొంతమవుతూ ఉంటాయి. అందుకే అన్నారు – నవ్వుల అంగి… రేలంగి అని. తెలుగు సినిమా హాస్యానికి రేలంగి మకుటంలేని మహారాజు. తెలుగు చిత్రసీమలో నవ్వుల పర్వాన్ని రేలంగికి ముందు, రేలంగికి తరువాత అని విభజించవలసి ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం మొదలు, తెలుగు చిత్రాల్లో విలువలు కరగిపోతున్నంత వరకూ…