Kalki collections : బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర…రూ.1000కోట్ల క్లబ్‌లో ప్రభాస్..?
- రూ. 1000 కోట్ల క్లబ్ లో ప్రభాస్ కల్కి
- నార్త్ అమెరికాలో నాన్ బాహుబలి-2 రికార్డు నెలకొల్పిన కల్కి
- ప్రభాస్ కెరీర్ లో రెండవ రూ.1000 కోట్ల సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. గత నెల 27న విడుదలైన ఈ పాన్ ఇండియన్ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఈ మ్యాజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కల్కి రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. వివరాలలోకి వెళితే నార్త్ అమెరికాలో కల్కి ప్రభంజనం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. 15రోజులకు గాను $17 మిలియన్ల కలెక్షన్లు రాబట్టి జవాన్, RRR చిత్రాల కలెక్షన్స్ దాటి హైయ్యెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ నాన్ బాహుబలి-2గా నిలిచింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలోను కల్కి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది.
కాగా కల్కి ప్రపంచవ్యాప్తంగా పదిహేను రోజులకు గాను రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరో రికార్డును తన పేరిట నమోదు చేసింది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు కలెక్షన్లు రాబట్టిన 6 చిత్రాలు వరుసగా అమిర్ ఖాన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా దంగల్ ₹2024 కోట్లు, ప్రభాస్ – రాజమౌళిల బాహుబలి-2 ₹1810.60 కోట్లు, Jr.Ntr,చరణ్- రాజమౌళిల RRR ₹1387.26 కోట్లు, యష్ – ప్రశాంత్ నీల్ కే.జి.యఫ్ ₹1250 కోట్లు, షారుక్ ఖాన్ పఠాన్ ₹1050కోట్లు, షారుక్ జవాన్ ₹1148.32 కోట్ల కలెక్షన్లు సాధించాయి. తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి 2898 ఏడీ” బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ₹1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో వెయ్యి కోట్లు సాధించిన 7వ సినిమాగా, ప్రభాస్ కెరీర్ లో రెండవ సినిమాగా కల్కి నిలిచింది.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
Also Read: Sai Pallavi: అందమైన కుందనాల బొమ్మ.. 6 అవార్డులు గెలిచెనమ్మా..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!