మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. RC15 నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక షూట్‌ని షెడ్యూల్ చేసారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమయ్యే షూటింగ్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ రివర్స్ అయ్యింది. అనుకున్నట్టుగా ఈ షెడ్యూల్ షూటింగ్ జరగట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ ను ఫిబ్రవరి 13 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి కారణం చెర్రీనే. ఆయన ప్రస్తుతం ముంబైలో ఉండడంతో షూటింగ్ షెడ్యూల్ డేట్ చేంజ్ చేశారని సమాచారం.
Read Also : Body shaming… తగిన సమాధానం చెప్పిన కాజల్
ఇక ‘RC15’ 2023 పొంగల్ సందర్భంగా తెరపైకి రానుంది. కాబట్టి మేకర్స్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంవత్సరం చివరి నాటికి టాకీ పార్ట్ పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. ఎన్నో అంచనాలున్న ఈ సినిమాను దాదాపు ఏడాది క్రితమే ప్రకటించారు. అప్పటి నుండి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఇంటెన్స్ యాక్షన్-పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు. ‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్‌తో కియారా జతకట్టడం ఇది రెండోసారి.
RC15లో రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.