లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక విషయాన్ని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా తన రైటింగ్ ని నమ్మి సినిమా చేసిన బుచ్చిబాబు, ఆశించిన రేంజ్ హిట్ కన్నా ఎక్కువ అందుకున్నాడు. ఈరోజు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో మెగా ఫ్యాన్స్ బుచ్చిబాబుకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ కారణంగా RC16 ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతోంది. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి RC 16 సినిమా రానుంది. మొదటి సినిమాతోనే సుకుమార్ కి తగ్గ శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు, రామ్ చరణ్ తో సినిమా చేసి గురువుని మించిన శిష్యుడు అనే పేరు తెచ్చుకునేలా ఉన్నాడు.
ఎన్టీఆర్ కి చెప్పిన కథనే చరణ్ కి తగ్గట్లు మార్పులు చేసి బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం బుచ్చిబాబు జాన్వీ కపూర్ తో పాటు భారీ కాస్టింగ్ ని సెట్ చేసాడు. రెహ్మాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు అనేది చాలా పెద్ద విషయం. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న రెహమాన్… ఇప్పుడు RC16తో సాలిడ్ సౌండ్ చేయబోతున్నాడు. టాప్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్స్ లని సెట్ చేసిన బుచ్చిబాబు… ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కి వచ్చిన క్రే జ్ ని న్యాయం చేస్తే చాలు పాన్ ఇండియా కాదు వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా RC16 సౌండ్ చేయడం గ్యారెంటీ. రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు అంటే బుచ్చిబాబు క్రెడిబిలిటీ ఇండస్ట్రీ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు.