తెలుగు హీరోల్లో హార్స్ రైడింగ్ చెయ్యాలి అంటే చిరంజీవి తర్వాతే ఎవరైనా. మెగాస్టార్ ని మించే రేంజులో, మెగాస్టార్ నే మరిపించే రేంజులో హార్స్ రైడింగ్ చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రెండో సినిమాతోనే మగధీరుడిగా నటించిన రామ్ చరణ్ హార్స్ రైడింగ్ లో దిట్ట. స్టైల్ అండ్ స్వాగ్ తో, పక్కా ప్రొఫెషనల్ లాగా గుర్రపుస్వారీ చెయ్యడంలో చరణ్ ఆరితేరిపోయాడు. మగధీర నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకూ తన హార్స్ రైడింగ్ స్కిల్స్ తో మెగా అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చిన చరణ్, ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ కి కిక్ ఇవ్వబోతున్నాడు. చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘RC 15’ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ పాన్ ఇండియా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
దర్శకుడు శంకర్ RC 15 సెట్స్ నుంచి తను గుర్రంపైన కూర్చున్న ఫోటో ఒకరటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోని చూస్తుంటే శంకర్, రామ్ చరణ్ తో కూడా హార్స్ రైడ్ చేయించినట్లు కనిపిస్తోంది. అయితే శంకర్ యాక్షన్ సీన్ కోసం కాకుండా ఒక సాంగ్ షూట్ కోసం చరణ్ ని హార్స్ ఎక్కించాడు. కియారా అద్వానీ, రామ్ చరణ్ పై ఒక సాంగ్ ని శంకర్ ప్లాన్ చేశాడు. ప్రభుదేవా ఖోరియోగ్రఫి చేస్తున్న ఈ సాంగ్ షూటింగ్ లో చరణ్ హార్స్ రైడింగ్ చేస్తున్నట్లు ఉన్నాడు. మరి హిస్టరీ రిపీట్ చేస్తూ చరణ్ హార్స్ రైడింగ్ తో మరో హిట్ కొడతాడేమో చూడాలి. హీరోని ఒక అద్భుతం అనిపించేలా చూపించే శంకర్, రామ్ చరణ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడు? చరణ్ డిఫరెంట్ షెడ్స్ ఉన్న రోల్ లో ఎలా కనిపించబోతున్నాడు? ఏ టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది అనే విషయాలు తెలియాలి అంటే మార్చ్ 27 వరకూ ఆగాల్సిందే.
A journey that has me back to back in the saddle!
Towards #RC15 pic.twitter.com/spv0c18y9R— Shankar Shanmugham (@shankarshanmugh) March 19, 2023