మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట, ఈ బ్యాక్ డ్రాప్ లోనే ‘RC 15’ రూపొందుతోంది. ఇప్పటికే ఆంధ్రాలో కొంత పార్ట్ షూట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది. కియారా అద్వాని, రామ్ చరణ్ పై ఒక సాంగ్ ని న్యూజిలాండ్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో షూట్ చేశారు. పది రోజుల పాటు జరిగిన ఈ సాంగ్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ “న్యూజిలాండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ సాంగ్, సాంగ్ లోని విజువల్స్ ఫ్యాబులస్ గా వచ్చాయి. శంకర్ మేకింగ్, సినిమాటోగ్రాఫర్ తిరు విజువల్స్, బాస్కో మార్టిస్ ఖోరియోగ్రఫీ ఈ సాంగ్ ని మరింత స్పెషల్ గా మార్చాయి. కియారా అద్వానీ అద్భుతంగా ఉంది, తమన్ ఎప్పటిలాగే ఇరగదీసాడు. స్టైలిష్ లుక్స్ కి కారణమైన ఆలిమ్ హాకిమ్, మనీష్ మల్హోత్రాకి థాంక్యు” అంటూ చరణ్ ట్వీట్ చేశాడు.
ఈ సంధర్భంగా చరణ్ కొన్ని ఫొటోస్ ని కూడా పోస్ట్ చేశాడు. ఇందులో చరణ్ కొత్త హెయిర్ స్టైల్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ‘ఎల్లో టీషర్ట్’లో చరణ్ ‘మగధీర’ సినిమాలోని లుక్ ని గుర్తుకు తెస్తున్నాడు. ఈ ఫోటోలని రీట్వీట్ చేస్తూ మెగా అభిమానులు చరణ్ అల్ట్రా స్టైలిష్ గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. న్యూజిలాండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న చరణ్ అండ్ టీం తిరిగి హైదరాబాద్ రానున్నారు. తిరిగి డిసెంబర్ నెలలో వైజాగ్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ సినిమాని కూడా చేస్తున్న శంకర్, నెలలో 12 రోజులు ఆ సినిమాని ఇంకో 12 రోజులు చరణ్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.