పండగ సీజన్ అనగానే ఫ్యామిలీతో పాటు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడం తెలుగు ఆడియన్స్ కి ఉన్న అలవాటు. ఈ కారణంగానే మన దగ్గర థియేటర్స్ ఇంకా బ్రతికున్నాయి. కుటుంబమంతా కలిసి సినిమా చూసి, లంచ్ లేదా డిన్నర్ చేస్తే పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు పబ్లిక్. ఇలా కుటుంబ మొత్తం థియేటర్స్ కి కదిలివచ్చేది పండగ రోజుల్లోనే, అందుకే మేకర్స్ ఫెస్టివల్ సీజన్స్ ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ దసరాకి మాత్రం రవితేజ ఫ్యామిలీ ఆడియన్స్ ని మిస్ చేస్తున్నట్లు ఉన్నాడు. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ… భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ సినిమాల్లో భగవంత్ కేసరి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అనీల్ రావిపూడి సినిమాల్లో ఉండే ఫన్ భగవంత్ కేసరి సినిమాలో ఉన్నట్లు ప్రమోషనల్ కంటెంట్ చెప్పేసింది.
శ్రీలీల, బాలయ్య క్యారెక్టర్ మధ్య ఎమోషనల్ డ్రామా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ భగవంత్ కేసరి సినిమాకి వెళ్లే అవకాశం ఉంది. లియో విషయంలో లోకేష్ కనగరాజ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి యూత్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. త్రిషాతో ట్రాక్ క్లిక్ అయితే లియో ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, లేదంటే యూత్ కే పరిమితం అవుతుంది. ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంది కానీ టైగర్ నాగేశ్వర రావు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు. రవితేజ సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి వెళ్లిపోతారు. మొదటిసారి టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని రవితేజ మిస్ అవుతున్నట్లు ఉన్నాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే అంశాలు కనిపించట్లేదు. ఇది రవితేజ సినిమా కలెక్షన్స్ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.