Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Don’t Be Shy: అలియా భట్ తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌పై తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి నిర్మించిన మూవీ ‘డోంట్ బి షై’. శ్రీతి ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందింది. ఇందులో అలియా భట్ నటించలేదు. అయితే నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు. కొత్త కథలు, కొత్త నటీనటులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పడు ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ని కూడా ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘డోంట్ బి షై’ కథ ప్రధానంగా నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. స్నేహం, ప్రేమ, బ్రేకప్, భవిష్యత్తుపై కలలు, కుటుంబంతో సంబంధాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే గందరగోళం వంటి అంశాలను కథలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ రొమాంటిక్ కామెడీ ‘డోంట్ బి షై’ థియేటర్లలో కాకుండా, నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. 2026 సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేటర్ రిలీజ్ లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. యూత్ కాన్సెప్ట్ తో వస్తున్న కథ కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఆరుషి బజాజ్, బియాంకా అరోరా, పీయూష్ ఖతి, అన్ష్ దుగ్గల్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు కునాల్ రాయ్ కపూర్, అనురాగ్ బసు, నేహా ధూపియా, అంజు అల్వా నాయక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొత్త నటులతోనే ఈ మూవీని తెరకెక్కించడం విశేషం.
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
ఇదిలా ఉంటే నటిగా అలియా భట్ కూడా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’లో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె నటిస్తున్నారు. అలాగే ‘బ్రహ్మాస్త్ర 3’, ‘తుంబాడ్ 2’ వంటి ప్రాజెక్టులు కూడా ఆమె లైనప్‌లో ఉన్నాయి. ఆమె నటించిన ‘ఆల్ఫా’ కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన ఈ సినిమా ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే, మరోవైపు నిర్మాతగా అలియా భట్ ప్రయాణంలో ‘డోంట్ బి షై’ మరో ఆసక్తికరమైన అడుగుగా మారింది. మరి థియేటర్లను పక్కనపెట్టి నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఈ యూత్‌ఫుల్ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో సెప్టెంబర్ 25న తేలనుంది.
- Tags
- Alia Bhatt
- cinema
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!