Site icon NTV Telugu

Ravi Kishan : పాలతో స్నానం చేస్తా.. గులాబీలపై పడుకుంటా.. రేసుగుర్రం విలన్ లైఫ్ స్టైల్

Ravi Kishan

Ravi Kishan

Ravi Kishan : రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు గానీ.. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉన్నాయి. నేను సినిమాల్లోకి రాక ముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడిని. అలాంటి వారిని చూపిస్తూ నువ్వు కూడా ఇలా ఉండాలి అని నాకు చెప్పేవారు. దాంతో సినిమాల్లో చేయాలంటే లైఫ్‌ స్టైల్ వేరేలా ఉండాలి అనుకునేవాడిని. అందుకే పాలతో స్నానం చేసేవాడిని.

Read Also : Allu Arjun : తెలుగువారంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్ మాస్ స్పీచ్..

గులాబీ రేకులపై పడుకునేవాడిని. అది చూసి మా వాళ్లు అందరూ షాక్ అయ్యేవారు. ఈ లైఫ్ స్టైల్ నాకు ఎప్పటి నుంచో అలవాటు. దాని వల్ల కొన్ని సినిమా అవకాశాలు కూడా కోల్పోయాను. నటుడిగా నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎవరూ చెప్పలేదు. అందుకే నేను కొన్ని ఊహించుకుని అలాగే ఉండేవాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రవికిషన్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైలర్ అవుతున్నాయి.

Read Also : Dilraju : విజయ్ ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి.. దిల్ రాజు కామెంట్స్..

Exit mobile version