Rathi Nirvedam Fame Swetha Menon Latest Photos goes Viral: మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత మలయాళీల అభిమానాన్ని చూరగొన్న నటి శ్వేతా మీనన్. జోమోన్ దర్శకత్వం వహించిన మమ్ముట్టి చిత్రం అనస్వరంతో శ్వేత మలయాళంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది శ్వేత. అయితే తెలుగు వారికి మాత్రం ఆమె పరిచయం అయింది రతినిర్వేదం సినిమాతోనే.
Karuna Bhushan: 11 ఏళ్ళ కొడుకు.. ఈసారి కవలలకు తల్లైన కరుణా భూషణ్
నిజానికి మలయాళ చిత్రసీమలోని కల్ట్ చిత్రాలలో ‘రతినిర్వేదం’ ఒకటి. భరతన్ దర్శకత్వంలో 1978లో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను పద్మరాజన్ నవల రతినిర్వేదం ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. భరత్ రతినిర్వేదం విడుదలైన సంవత్సరాల తర్వాత , శ్వేతా మీనన్ కథానాయికగా మరో రతినిర్వేదం వెర్షన్ వచ్చింది.
ఈ సినిమాలో శ్వేతా మీనన్ సరసన శ్రీజిత్ హీరోగా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇదిలా ఉండగా శ్వేతా మీనన్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అప్పటి కంటే ఇప్పుడే బాగుంది అంటూ కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం మారలేదు అని కామెంట్ చేస్తున్నారు. మీకు ఏం అనిపిస్తోందో కామెంట్ చేయండి.