Karuna Bhushan Became Mother to Twins : ఆహా’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన కరుణభూషణ్ తర్వాత చాలా సినిమాలలో నటించి ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉంది. నిజానికి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘కాటమరాయుడు’ వంటి సినిమాల్లో ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు పడ్డాయి. అలాగే యువ సీరియల్‌తో బుల్లితెరపై కూడా ప్రస్తుతం వైదేహి పరిణయం సీరియల్ చేస్తున్న కరుణ భూషణ్ తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేమంటే కరుణా భూషణ్ మరోసారి తల్లయింది. ప్రస్తుతానికి కరుణ భూషణ్ కి 11 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఈ మధ్యనే ఆమె తన కుమారుడితో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Darshan: డబ్బులిచ్చి భోజనం చేసి ఊరెళ్లమన్నా.. రేణుకా స్వామి హత్యతో సంబంధం లేదు!
అయితే ఇప్పుడు అనూహ్యంగా తాను ఇద్దరు కవల పిల్లలకు తలయ్యాను అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఒక్కసారిగా తన అభిమానులందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోను సైతం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లల్ని కనేంతవరకు తన జర్నీ ఎలా సాగింది అనే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో అధికారికంగా పేర్కొంది. అంతేకాదు ఈ నెల ఏడో తారీఖున తాను తల్లి అయ్యాను అని అప్పటినుంచి తమ జీవితాలను తనకు పుట్టిన బిడ్డలు పరిపూర్ణం చేశారంటూ ఆమె రాసుకొచ్చింది. అలాగే తన జీవితంలోని ప్రతి ఘట్టంలో తోడుగా ఉంటున్న దుర్గామాతకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పుకొచ్చింది. నేను నిన్ను కొంచెం అడిగిన ప్రతిసారి దానికి డబుల్ ఇస్తూ వచ్చావు. ఈ పుట్టినరోజుని మరింత స్పెషల్ చేశావు. ఈ ప్రేమను మాటల్లో చెప్పడానికి చాలడం లేదు అంటూ ఆమె రాసి రాసుకొచ్చింది.