నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ పై పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సరసన, సిద్దార్థ్ మల్హోత్రా సరసన రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ ఉగాది పర్వదినాన మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే చివరికి ఆ అవకాశం నేషనల్ క్రష్ కొట్టేసింది. రణబీర్ సరసన మొట్టమొదటిసారి రష్మిక నటించనుంది. ఇక చిత్రంలో రష్మిక రోల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మనిషి అడువుల్లో తిరిగే జంతువులా మారితే? ఎలా ఉంటుంది? అన్న డిఫరెంట్ థాట్ ని కథగా మార్చి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సందీప్ వంగా.. ఇక ఈ సినిమాలో రష్మిక సైన్స్ స్టూడెంట్ గా కనిపించనున్నదట. అడివిలో తిరిగే హీరోకు సైన్స్ గురించి చెప్పే సన్నివేశాలు చాలా రొమాంటిక్ గా ఉంటాయని, ఈ సినిమాలో రష్మిక రొమాన్స్ పీక్స్ లో ఉండనున్నాయని సమాచారం. ఇక ఇదే కనుక నిజమైతే రష్మిక దశ తిరిగినట్లే.. అర్జున్ రెడ్డి లో సందీప్ చూపించిన రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ సినిమాలో అంతకుమించి సందీప్ చూపించనున్నాడని టాక్.. అది ఎంతవరకు నిజమో చూడాలి.