Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే అనిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న ఈ భామ ఆ ఇమేజ్ ను వాడేసుకుంటుంది. మంచి మంచి కథలను ఎంచుకొని లైనప్ లో పెట్టుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 సెట్స్ మీద ఉంది. దింతో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా చేస్తుంది. ఇవి కాకుండా అమ్మడి చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయని టాక్. ఇక ఈ మధ్యనే అనిమల్ సినిమా తరువాత అమ్మడు రెమ్యూనిరేషన్ పెంచేసింది వార్తలు వచ్చాయి. కానీ, అవేమి నిజం కాదని రష్మిక తన స్టైల్ ల్లో ఇచ్చిపడేసింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రష్మికకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. నేషనల్ క్రష్ మరోసారి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేస్తుందట. అదేంటి ప్రస్తుతం సందీప్ స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నాడుగా అంటే.. అవును.. రష్మిక కూడా స్పిరిట్ లోనే నటిస్తుందని టాక్. .
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికనే హీరోయిన్ గా తీసుకుందామని సందీప్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అనిమల్ సినిమా కోసం సందీప్ మొదట పరిణీతి చోప్రాను అనుకున్నా కూడా మధ్యలో ఆ క్యారెక్టర్ ఆమెకు సెట్ కాలేదని రష్మికను తీసుకున్నాడు. ఒక ఆల్పా ఉమెన్ ఎలా ఉండాలో రష్మికలో చూశాడట సందీప్. అందుకే స్పిరిట్ లో కూడా రష్మికనే తీసుకొనే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాకున్న అనిమల్ తో బాలీవుడ్ లో ఈ బ్యూటీకి ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యింది. అది కూడా సినిమాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ ఛాన్స్ కనుక రష్మికను వస్తే.. ఈ చిన్నది నక్క తోక తొక్కినట్టే. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.