Rashmika Mandanna: నేషనల్ క్రిష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి హీరో విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. ఇక వారిద్దరూ మాత్రం మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ ఎన్నోసార్లు చెప్పుకొస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈ జంటను సోషల్ మీడియా వదలడం లేదు. ముఖ్యం బాలీవుడ్ మీడియా వీరిద్దరూ పెళ్లి చేసుకొనేవరకు వదిలేలా లేదని తెలుస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో రష్మిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు, చిన్న చిన్న కోరికలను తీరుస్తూ ఉంటుంది.
తాజాగా ఒక అభిమాని రష్మికకు కాబోయే భర్త ఎలా ఉండాలి అని చెప్పుకురాగా.. దానికి రష్మిక అవును నిజం అలాగే ఉండాలి అని రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ” రష్మికమందన్న భర్తగా మారాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఆమె నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా.. ఆమె భర్త ప్రత్యేకంగా ఉండాలి. ఆమె భర్త వీడిలా ఉండాలి. నా ఉద్దేశ్యం వెరీ డేరింగ్. ఆమెను ఎవరు రక్షించగలరు. మేము ఆమెను రాణి అని పిలుస్తాము.. అప్పుడు ఆమె భర్త కూడా రాజులా ఉండాలి” అంటూ రాసుకొచ్చాడు. దానికి రష్మిక.. ఇది నిజం అని చెప్పుకొచ్చింది. అంటే.. తనకు కాబోయే భర్త వెరీ డేరింగ్ గా ఉండాలి అని చెప్పుకొచ్చింది. ఇక VD అన్న పదాన్ని పట్టుకొని మరోసారి VD అంటే విజయ్ దేవరకొండ అని చెప్పుకొచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
That’s very true 😄❤️
— Rashmika Mandanna (@iamRashmika) February 27, 2024