Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని.. సోషల్ మీడియాలో జరిగే వాటిని నేను పెద్దగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇక కాంతార చాప్టర్ 1 రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందిస్తున్నారు.
Read Also : Deepika Padukone : హిజాబ్ ధరించిన దీపిక.. ఓ రేంజ్ లో ట్రోల్స్..
రిషబ్ శెట్టి నటనను పొగుడుతున్నారు. కానీ రష్మిక మాత్రం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో కాంతార మొదటి పార్టు విషయంలోనూ ఇదే జరిగింది. వీటిపై ఆమె రియాక్ట్ అయింది. ‘నేను ఏ సినిమా రిలీజ్ అయినా మూడు నాలుగు రోజుల దాకా చూడను. నాకు బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాంతార మొదటి పార్టును కూడా చాలా లేటుగానే చూసా. ఆ టీమ్ కు పర్సనల్ గా మెసేజ్ చేస్తే వాళ్లు నాకు థాంక్స్ కూడా చెప్పారు. అవన్నీ బయటకు చెప్పుకోలేం కదా. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు రాసేస్తారు. నేను అవన్నీ పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : WAR -2 : వార్ -2 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన
