అభిమానులు ‘కర్ణాటక క్రష్’ అని ముద్దుగా పిలుచుకునే ప్రముఖ సౌత్ నటి రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”లో రష్మిక శ్రీవల్లిగా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 17న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి హిందీతో సహా పలు భాషలలో విడుదల కానుంది. మరోవైపు ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ “మిషన్ మజ్ను” కూడా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా రష్మిక తన ప్రేమ జీవితం గురించి స్పందించింది. ఇటీవల ఓ షోలో పాల్గొన్న రష్మిక తరచుగా విజయ్ దేవరకొండతో ప్రేమాయణం అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని చెప్పింది. ఇక తన కంటే వయసులో చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్ చేస్తావా? అని ఎదురైనా ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ ‘వయస్సు కంటే ఎక్కువ, ఇది వ్యక్తికి సంబంధించినది. వారు తమ గురించి ఆలోచించేలా చేస్తారు’ అని బదులిచ్చారు.
Read Also : “గాడ్ ఫాదర్”లో స్టార్ హీరో పక్కా… రివీల్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
సోషల్ మీడియాలో చొక్కా లేకుండా పోజులిచ్చే అబ్బాయిల గురించి మాట్లాడుతూ “కుర్రాళ్లు వెళ్లి వర్కవుట్ చేయడం, ఫిట్‌గా కన్పించడాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. మీరు ఎంత అంకితభావంతో ఉన్నారో అది చూపిస్తుంది. కానీ దీన్ని మీ ప్రొఫైల్ ఫోటోగా ఉంచాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇలా వ్యక్తులు మీ శరీరాన్ని చూసే దశకు చేరుకోవడానికి మిమ్మల్ని తెలుసుకునేలా చేయండి” అంటూ యూత్ లో మరింత ఉత్సాహాన్ని నింపింది.