నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమెను అభిమానులు ప్రేమగా ‘నేషనల్ క్రష్’ అని పిలుచుకుంటారు. ఈ బ్యూటీ తన తోటి హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ అతి తక్కువ వ్యవధిలోనే ఇండస్ట్రీలో మెగా విజయాన్ని కూడా సాధించింది. ఆమె నటనా నైపుణ్యాలు, అందం, అద్భుతమైన వ్యక్తిత్వం రష్మికకు సూపర్ స్టార్ డమ్ ను తీసుకొచ్చాయి. సినీ పరిశ్రమలో ఘనంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న సోషల్ మీడియా వేదికగా రష్మిక ఓ స్పెషల్ నోట్ పంచుకుంది.
Read Also : జపాన్ లో ప్రభాస్ ని ఇలా కూడా వాడేస్తున్నారా? సూపర్ క్రేజ్!
2016లో రష్మిక కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ స్పెషల్ పోస్ట్ లో రష్మిక తన ఐదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తాను అనుభవించిన భావోద్వేగాలు, ఉత్సాహంతో పాటు దాదాపు ప్రతీ విషయం గురించి ఒక వివరణాత్మక పోస్ట్‌ను రాసింది. పది పాయింట్లతో ఆమె రాసుకొచ్చిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
