బాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘ధురంధర్’ ఒకటి. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఆయన చేస్తున్న రెండవ సినిమా కావడంతో హైప్ మరింత పెరిగింది. యాక్షన్, పీరియడ్ డ్రామా మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2025 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్‌కి ఎనర్జిటిక్ హీరోగా పేరొందిన రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఎప్పుడూ విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న రణ్‌వీర్, ‘ధురంధర్’లో కూడా ఓ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. అతని పాత్ర ఎలా ఉంటుందో అనేది ఇప్పటికే అభిమానుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది.. ఇక
Also Read : Kantara Chapter 1 :‘కాంతార’ నుంచి విలన్ ‘కులశేఖర’ పోస్టర్ రిలీజ్..
ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతుండగా, సెట్ లో జరిగిన ఈ అనుకోని ఘటన చిత్ర బృందాన్ని కంగారుకు గురి చేసింది. షూటింగ్ సెట్ లో భారీ కలకలం రేగింది. లేహ్‌లో జరుగుతున్న షూటింగ్‌లో సినీ కార్మికులకు సరఫరా చేసిన ఆహారం కారణంగా ఒక్కసారిగా 120 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పితో బాధపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతానికి అందరి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆహారం కలుషితమైందని అనుమానిస్తున్న అధికారులు, ఘటన చోటు చేసుకున్న ప్రదేశం నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ టెస్టులకు పంపించారు. వైద్యుల ప్రకారం ఇది స్పష్టమైన ఫుడ్ పాయిజనింగ్ కేసు అని తేలింది.