Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Rani Mukherji To Play Key Role In Ssmb28

SSMB28: త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. బాలీవుడ్ స్టార్ నటి రంగంలోకి?

Published Date :December 19, 2022 , 7:25 pm
By NTV WebDesk
SSMB28: త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. బాలీవుడ్ స్టార్ నటి రంగంలోకి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rani Mukherji To Play Key Role In SSMB28: త్రివిక్రమ్ సినిమాల్లో చూసుకుంటే.. కామన్‌గా ఒక పాయింట్ ఉంటుంది. అదే.. కీలకమైన మహిళ పాత్ర. ఈ రోల్ కోసం ఆయన బాగా పేరుగడించిన ప్రముఖ నటీమణుల్నే ప్రత్యేకించి మరీ ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకి ఉన్న బలం, అందులో ఎవరు ఇమడగలరన్న సామర్థ్యాలతో పాటు ఆ పాత్ర వన్నె తీసుకురాగల సీనియర్ భామల్ని సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తోన్న SSMB28 సినిమా కోసం కూడా ఓ క్రేజీ భామని రంగంలోకి దింపాడని సమాచారం. ఈసారి దక్షిణాది నుంచి కాకుండా.. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చాడని తెలిసింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరనుకుంటున్నారా? రాణీ ముఖర్ఖీ.

Rani Mukherjee

Also Read

  • Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
  • NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

ఒకప్పుడు హీరోయిన్‌గా బాలీవుడ్‌లో చక్రం తిప్పిన రాణీ ముఖర్జీ.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అది కూడా రెగ్యులర్‌గా కాదు, తనకు తగ్గ స్క్రిప్ట్ దొరికినప్పుడే! వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కాస్త జోరు తగ్గించిన మాట వాస్తవమే కానీ, ఆమె క్రేజ్ మాత్రం తరిగిపోలేదు. అందుకే, మహేశ్ సినిమా కోసం త్రివిక్రమ్ ఏరికోరి మరీ ఆమెను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఆమెను తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. మహేశ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయా ఇండస్ట్రీలో పేరుగడించిన నటీనటుల్ని సెలెక్ట్ చేస్తున్నాడు. తాను రాసుకున్న పాత్రకి రాణీ ముఖర్జీ సెట్ అవుతుందని, ఆమె వల్ల అక్కడ సినిమాకి క్రేజ్ కూడా కలిసొస్తుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. మరి, ఇది నిజమా? కాదా? అనేది తేలాల్సి ఉంది.

Bigg Boss-6: ఆదిరెడ్డి ఇంత పారితోషికం తీసుకున్నాడా?

కాగా.. అతడు, ఖలేజా తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. దీంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ వచ్చిపడింది. అందుకు తగినట్టుగానే.. భారీతనంతో ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mahesh babu
  • Pooja Hegde
  • Rani Mukherji
  • SS Thaman
  • SSMB28

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions