Rani Mukherji To Play Key Role In SSMB28: త్రివిక్రమ్ సినిమాల్లో చూసుకుంటే.. కామన్‌గా ఒక పాయింట్ ఉంటుంది. అదే.. కీలకమైన మహిళ పాత్ర. ఈ రోల్ కోసం ఆయన బాగా పేరుగడించిన ప్రముఖ నటీమణుల్నే ప్రత్యేకించి మరీ ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకి ఉన్న బలం, అందులో ఎవరు ఇమడగలరన్న సామర్థ్యాలతో పాటు ఆ పాత్ర వన్నె తీసుకురాగల సీనియర్ భామల్ని సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తోన్న SSMB28 సినిమా కోసం కూడా ఓ క్రేజీ భామని రంగంలోకి దింపాడని సమాచారం. ఈసారి దక్షిణాది నుంచి కాకుండా.. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చాడని తెలిసింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరనుకుంటున్నారా? రాణీ ముఖర్ఖీ.
ఒకప్పుడు హీరోయిన్‌గా బాలీవుడ్‌లో చక్రం తిప్పిన రాణీ ముఖర్జీ.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అది కూడా రెగ్యులర్‌గా కాదు, తనకు తగ్గ స్క్రిప్ట్ దొరికినప్పుడే! వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కాస్త జోరు తగ్గించిన మాట వాస్తవమే కానీ, ఆమె క్రేజ్ మాత్రం తరిగిపోలేదు. అందుకే, మహేశ్ సినిమా కోసం త్రివిక్రమ్ ఏరికోరి మరీ ఆమెను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఆమెను తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. మహేశ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయా ఇండస్ట్రీలో పేరుగడించిన నటీనటుల్ని సెలెక్ట్ చేస్తున్నాడు. తాను రాసుకున్న పాత్రకి రాణీ ముఖర్జీ సెట్ అవుతుందని, ఆమె వల్ల అక్కడ సినిమాకి క్రేజ్ కూడా కలిసొస్తుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. మరి, ఇది నిజమా? కాదా? అనేది తేలాల్సి ఉంది.
Bigg Boss-6: ఆదిరెడ్డి ఇంత పారితోషికం తీసుకున్నాడా?
కాగా.. అతడు, ఖలేజా తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. దీంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ వచ్చిపడింది. అందుకు తగినట్టుగానే.. భారీతనంతో ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.