Pushpa2 : ఇప్పడు సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ను కూడా డామినేట్ చేస్తన్న సంగతి తెలిసిందే కదా. చాలా కాలంగా బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆడట్లేదు. దాంతో సౌత్ సినిమాలు హిందీ మార్కెట్ ను శాసించే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ టైమ్ లో సౌత్ సినిమాలను బాలీవుడ్ ను చాలా మంది పోల్చుతున్నారు. తాజాగా స్టార్ యాక్టర్ రణ్ దీప్ హుడా ఇలాంటి కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ లో అందరూ గొర్రెల్లాగా ఒకే తరహా కంటెంట్ ను నమ్ముకుంటున్నారని విమర్శించారు. ఒక సినిమా హిట్ అయితే అందరూ అదే కాన్సెప్టుతో సినిమాలు చేయడం వల్లే బాలీవుడ్ కు దెబ్బ పడుతోందన్నారు.
Read Also : Goa: ‘‘ఇక ఎప్పటికీ గోవా రాను’’.. భయానక ఘటనపై టూరిస్ట్ పోస్ట్ వైరల్..
‘బాలీవుడ్ ఎంత సేపు కండలు, బాడీ ఫిజిక్ మీద పెట్టిన శ్రద్ధ కంటెంట్ మీద పెట్టట్లేదు. సినిమాలో ఎమోషన్ సరిగ్గా ఉండట్లేదు. కానీ సౌత్ సినిమాలో అలా కాదు. ప్రతి సినిమాలో ఎమోషన్స్ ను తీర్చిదిద్దడంపై ఫోకస్ పెడుతారు. అక్కడి పాత్రలకు ఫిజిక్ అవసరం లేదు. పుష్ప సినిమా చూడండి. అందులో అల్లు అర్జున్ కు సిక్స్ ప్యాక్ లేదు. పైగా భుజం విరిగింది. కానీ కంటెంట లో ఎమోషన్ ఉంది. అలాంటి సినిమాను చూసి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలి. ఎంతసేపు హీరో ఫిజిక్, హీరోయిన్ గ్లామర్ మీదనే దృష్టి పెడితే సరిపోదు. సినిమాలో కంటెంట్, విలువలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు రణ్ దీప్.