Brahmastra: గత కొన్ని నెలలుగా బాలీవుడ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. స్టార్ హీరో సినిమాలు కూడా థియేటర్లో రెండు అంటే రెండు రోజులు కూడా ఆడడం లేదు. ఇక మధ్యలో బాయ్ కాట్ ట్రెండ్ రావడంతో కొన్ని సినిమాలు అంతుచిక్కకుండా పోయాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఆశలన్నీ బ్రహ్మాస్త్ర పైనే ఉన్నాయి. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్ తో పాన్ ఇండియా సినిమాగా బ్రహ్మాస్త్ర రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాను తెలుగులో రాజమౌళి రిలీజ్ చేస్తుండడంతో ప్రమోషన్స్ లో ఆయన కూడా పాల్గొని అభిమానులకు అభయం ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
దుబాయ్ క్రిటిక్ ఉమైర్ సంధు బ్రహ్మాస్త్ర మొదటి రివ్యూ ఇచ్చాడు. తనకు తానే పెద్ద క్రిటిక్ ను అని చెప్పుకొచ్చే ఇతడు బ్రహ్మాస్త్ర యావరేజ్ అని తేల్చేశాడు. “బ్రహ్మాస్త్ర.. మెరిసేదంతా బంగారం కాదు” అని మొదలుపెట్టాడు. ఈ ఒక్క వర్డ్ తోనే సినిమా ఏంటి అనేది చెప్పుకొచ్చాడని నెటిజన్స్ అంటున్నారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ “బాలీవుడ్‌లో ఫాంటసీ/సాహస చిత్రాలు చాలా అరుదు. వాస్తవానికి, ఇలాంటి కలల రాజ్యంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాలి అన్న ప్రయత్నం చేసిన అయన్‌ముఖర్జీని మీరు అభినందించాలి. కానీ స్క్రీన్‌ప్లే & కథ పూర్తిగా యావరేజ్. కథ అంతా గందరగోళంగా ఉంది. ఇక రణబీర్ కూడా అంతే గందర గోళంలో ఉన్నట్లు కనిపించాడు. కథలో ఏం జరుగుతుందో తనకు కూడా తెలియలేదేమో.. అలియా, మౌని రాయ్ నటన అద్భుతం. అమితాబ్ కనిపించిన కొద్దిసేపు అదరగొట్టేశాడు.. కానీ చాలా తక్కువగా ఆయన కనిపించడమే బాగోలేదు. కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ బావుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇతను చెప్పినదాన్ని బట్టి చూస్తే సినిమా యావరేజ్ అని తెలుస్తోంది. అయితే రివ్యూలను చూసి సినిమాకు వెళ్లడం అనేది చాలా తప్పు అని, సినిమా అతడికి నచ్చకపోవచ్చు మిగతావారికి నచ్చదని గ్యారెంటీ ఏంటి..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.
Fantasy/adventure films are a rarity in Bollywood. Actually, you want to laud #AyanMukerji for being courageous, for venturing into a lane that's rarely visited by dream merchants here. But the screenplay & story is a complete average & sometimes mess in #Brahmastra ! 2.5⭐️/5⭐️
— Umair Sandhu (@UmairSandu) September 6, 2022
#RanbirKapoor looking so confused in #Brahmastra ! He even didn’t know what’s going on 😀 ! #Aliabhatt looking stunning in movie ! Wow 🤩! #MouniRoy looking so creepy! Loud performance by her ! #AmitabhBachchan is grace personified. The only regret is, he gets less footage.
— Umair Sandhu (@UmairSandu) September 6, 2022
#Brahmastra = All that Glitters is not gold !!!
⭐️⭐️1/2
— Umair Sandhu (@UmairSandu) September 6, 2022