Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్- అలియా నాలుగేళ్లు ప్రేమించుకొని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందే అలియా ప్రెగ్నెంట్ కావడంతో త్వరత్వరగా పెళ్లి తంతును ముగించారు. ఇక పెళ్ళైన రెండు నెలలకే అలియా తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసింది. అప్పట్లో ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రణ్‍బీర్, ఆలియా భట్‍కు 2022 నవంబర్ 6న కూతురు రాహా జన్మించింది. ఇక కూతురు ముఖాన్ని ఏడాది అయినా కూడా అలియా బయట ప్రపంచానికి చూపించలేదు. అందుకు కారణాన్ని కూడా ఆలియా ఓ సందర్భంలో చెప్పారు. తాము కొత్తగా తల్లిదండ్రులయ్యామని, ఇంటర్నెట్‍లో ఆమె ఫొటోలు తిరుగుతుంటే తమకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అర్థం కాక ముఖం చూపించడం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఎట్టకేలకు గతేడాది క్రిస్టమస్ కు కపూర్ వారసురాలిని మీడియాకు పరిచయం చేశారు, రాహా.. అచ్చుగుద్దినట్లు ఆమె తాత రిషి కపూర్ పోలికలతో ఉంది. రాహా ఫోటోలు రావడం.. ట్రెండ్ క్రియేట్ చేసాయి. ఇక తాజాగా మరోసారి ఈ బేబీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక తాజాగా రణబీర్ ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ లో కనిపించి కనువిందు చేసింది. రణబీర్ కూతురు రాహాను ఒక చేత్తో పట్టుకొని.. మరోచేత్తో మీడియాకు హయ్ చెప్పగా .. వెనుక నుంచి అలియా క్యాజువల్ డ్రెస్ లో కారు ఎక్కుతూ కనిపించింది. ఇక అక్కడ ఉన్న వారందరి కళ్లు రాహా మీదనే ఉన్నాయి. పింక్ కలర్ స్వేట్టర్ లో రాహా ఎంత క్యూట్ గా ఉందో చెప్పడం కష్టమే. ఎప్పుడు ఎయిర్ పోర్ట్ లో కనిపించినా అలియా మాత్రమే మీడియా అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. కానీ ఈసారి మాత్రం రాహా తల్లిని మించి పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.