Ramya Krishnan: రమ్యకృష్ణ పొలిటికల్ ఎంట్రీ.. రోజాను చూసి.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramya Krishnan: బాహుబలి శివగామిగా రమ్యకృష్ణ నటనను చూసి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందం, అభినయం కలబోసిన రూపం రమ్యకృష్ణ .. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. మొదట్లో ఐరన్ లెగ్ గా పేరుతెచ్చుకొని, ఎన్నో అవమానాలు పడిన ఆమె మెల్లగా వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా హిట్లు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఐటెం సాంగ్స్ చేసి అలరించింది. ఇక డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లాడిన రమ్యకృష్ణ.. సహాయనటిగా.. ప్రత్యేకపాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఈ మధ్యనే జైలర్ సినిమాలో రజినీకాంత్ కు భార్యగా నటించి మెప్పించిన ఆమె .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఈ మధ్యనే రమ్యకృష్ణ.. నటి, మినిస్టర్ అయిన రోజా ఇంటికి విచ్చేసిన విషయం తెల్సిందే . ఇక అప్పటినుంచి రమ్యకృష్ణ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది.
” రోజా, నేను చాలా మంచి స్నేహితులం. అప్పుడు ఎలా ఉండేవాళ్ళమో.. ఇప్పుడు అలాగే ఉన్నాం. చాలా ఏళ్ళ తరువాత నేను తిరుపతికి వెళ్ళాను. అక్కడ దర్శనం మంచిగా అవ్వడానికి కారణం రోజానే. చాలా మంచి దర్శనం చేయించినందుకు ఆమెకు థాంక్స్ చెప్పాలని ఇంటికి వెళ్లాను. మేము పాలిటిక్స్, సినిమాలు ఇవేమి మాట్లాడుకోలేదు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే .. మీ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఇదే మాట్లాడుకున్నాం. ఇక పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పాలంటే.. ఒకరిని చూసి రాజకీయాల్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ రాదు. ఎవరికి వాళ్లకు ఆసక్తి ఉండాలి. రోజాకు ఉంది.. వెళ్ళింది. ఆమె ఎంతో కష్టపడింది. ఇక భవిష్యత్ లో ఏదైనా పార్టీలో చేరతాను లేదు అనేది చెప్పలేను. వచ్చినప్పుడు చూద్దాం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రమ్యకృష్ణ వైకాయలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!